నారాయణ్ ఖేడ్ వెలుగు: నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని కార్మిక, మైనింగ్ శాఖ, మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి కోరారు. బుధవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి.. నియోజకవర్గఅభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
